భారతదేశం, ఫిబ్రవరి 10 -- తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్లోని అగ్రనేతలను సిట్ విచారణ చేసింది. అయితే తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్పై సంచలన ఆరోపణలు చేశారు. భారత రాష్ట్ర సమితి ఇప్పటికీ ప్రజల ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం త్వరలో ఈ విషయాన్ని బహిర్గతం చేస్తుందని చెప్పారు.
'ఇప్పటికీ అధికారులతో కాన్ఫరెన్స్ కాల్లో మేం జరిపిన సంభాషణలు బహిరంగంగా రావడం అనుమానాస్పదంగా ఉంది, బహుశా వారు ఇప్పటికీ ఆ పరికరాలను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఎవరెవరు ఇందులో పాల్గొన్నారో, ఏ ఫామ్‌హౌస్‌లు లేదా మామిడి తోటలలో పరికరాలు దాచారో త్వరలో బయటపెడతాం.' అని మంత్రి పొంగులేటి అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని విచారణ జరుగుతోంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.