భారతదేశం, డిసెంబర్ 23 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసు అందిందన్న వార్తలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందంచారు. తెలంగాణలో జరుగుతున్న విచారణలు, అరెస్టులను తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో సిట్‌లు ప్రహసనంగా మారాయని అభివర్ణించారు. ప్రతిపక్ష నాయకులైన తమపై కేసులు కొత్త కాదని హరీష్ రావు పేర్కొన్నారు. కొంతమంది అధికారులు అనుకూలమైన పోస్టింగ్‌ల కోసం దూకుడుగా చట్టవిరుద్ధమైన కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మంచి పేరు కోసం ప్రయత్నిస్తున్న అధికారులకు ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కోసం అతిచేస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మార్పులను ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. రాజకీయ కక్షతో ఇబ్బందిపెడితే.. మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక రాజకీయ వర్గానికి చెందిన నాయ...