భారతదేశం, జనవరి 29 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావును విచారించగా. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది.
గురువారం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు. నోటీసులు అందజేశారు.శుక్రవారం (రేపు) మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.వయసురీత్యా విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని.. మీరు కోరిన చోటే విచారిస్తామని కేసీఆర్‌కు తెలిపారు.
కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో ఉన్నారు. అయితే ఇవాళ ఉదయం సిట్ అధికారులు అక్కడికే వెళ్లి నోటీసులు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అక్కడికి వెళ్లకుండా. బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.
Published by...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.