భారతదేశం, జూన్ 17 -- ాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ సిట్ విచారణకు హాజరయ్యారు. సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చారు. కిందటి ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా అనుమానం రావడంతోనే సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్టుగా ఆయన చెప్పారు. సిట్ విచారణ అనంతరం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ మీద మహేశ్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం దారుణమైన చర్య అని చెప్పారు. దీనికి పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలవంచుకోవాలని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ల ట్యాపింగ్ కారణమని తెలుస్తోందన్నారు. రేవంత్ రెడ్డితోపాటుగా తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు.

ఈ విషయంపైనే ఫిర్యాదు చేసినట్టుగా మహేశ్ గౌడ్ గుర్తు ...