భారతదేశం, జూన్ 1 -- సీబీఎస్‌ఈ (CBSE) 12వ తరగతి పరీక్షల జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల జవాబు పత్రాలను మొబైల్ ఫోన్లతో స్కాన్ చేశారని, ఇదొక పెద్ద మోసమని ఆయన ఆరోపించారు. ఒక ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే టెండర్ నిబంధనలను మార్చారని మండిపడ్డారు.

సోషల్ మీడియా వేదికగా (X) రాహుల్ గాంధీ ఈ వ్యవహారాన్ని లేవనెత్తారు. జార్ఖండ్‌కు చెందిన సార్థక్ సిద్ధాంత్ అనే 12వ తరగతి విద్యార్థి సేకరించిన టెండర్ వివరాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై, సీబీఎస్‌ఈ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

"2025 మే నెలలో సీబీఎస్‌ఈ జారీ చేసిన టెండర్ నిబంధనల ప్రకారం.. జవాబు పత్రాలను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్ల ద్వారా, కనీసం 300 డీపీఐ (D...