భారతదేశం, ఫిబ్రవరి 15 -- కరీంనగర్ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అంతేకాదు ఇందులో పోలీసులు తనన వేధిస్తున్నారని ఆరోపణలు చేశాడు. అందుకే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులకు విచారణ చేయగా.. ఆ వ్యక్తి కేవలం బెదిరించడానికి, అతడిపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు ఇలా చేశాడని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కరీంనగర్ జిల్లాలో క్రిమినల్ చర్యలను తప్పించుకునేందుకు నకిలీ ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీరియల్ క్రిమినల్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డి నిందితుడిని రోమాల ఉదయ్‌గా వెల్లడించారు. అతనిపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. పోలీసులపై ఆరోపణలు చేస్తూ విషం తాగినట్...