భారతదేశం, నవంబర్ 14 -- మగవారిలో వచ్చే సంతాన సమస్యలపై తెరకెక్కిన సినిమానే సంతాన ప్రాప్తిరస్తు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా జంటగా నటించిన ఈ సినిమా ఇవాళ (నవంబర్ 14) థియేటర్లలో విడుదలైంది. అయితే, ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు సంబంధించిన విశేషాలను నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి పంచుకున్నారు.

-ఈ సినిమా చూశాక ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్న వారికి ఒక ధైర్యం వస్తుంది. మంచి మెసేజ్ చేరుతుంది. మనం ఈ సమస్య కోసమా ఇంత బాధపడింది అనుకుంటారు. టైటిల్ విషయంలో మొదట్లే ఏంటీ టైటిల్ అనుకునేవారు కూడా ట్రైలర్ రిలీజ్ అయ్యాక "సంతాన ప్రాప్తి...