Hyderabad, Oct. 26 -- తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బకాయిల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రభుత్వంతో పలుసార్లు సమావేశం అయింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా.. తర్వాత రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తోపాటుగా ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబర్ 3వ తేదీ నుంచి బంద్ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేశ్ బాబు చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, లేదంటే కాలేజీలు నడిపే పరిస్థితుల్లో లేమని తెలిపారు. రూ.1200 కోట్ల బకాయిలు చెల్లిస్తామని రూ.300 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

మంత్రులు మాకు సహకరించడం ...