భారతదేశం, ఏప్రిల్ 20 -- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, మన దేశంలో ఏడాదికి సుమారు 47 వేల కొత్త కేసులు వస్తున్నాయి. అంటే మొత్తం క్యాన్సర్ కేసుల్లో సుమారు 3 శాతం దీనిదే. ఇంకో 10-20 ఏళ్లలో ఇది మరింత పెరుగుతుంది అంటున్నారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ కి ప్రధానమైన ప్రమాద కారణం - వయసే.  ఎందుకంటే... ఇప్పుడు, వైద్య సదుపాయాలు పెరిగి, టెక్నాలజీ తోడై, మనిషి ఆయుర్దాయం పెరుగుతోంది.  వయసు పెరిగిన వారిలో ఈ క్యాన్సర్ రిస్క్ కూడా ఆటోమాటిక్‌గా పెరుగుతుంది.

విస్తృతమైన స్క్రీనింగ్ టెస్టులు, క్యాన్సర్ పై అవగాహన, ఇంకా  ఫ్యామిలీ హిస్టరీ, జాతి, జన్యు కారణాలు (genetic factors) ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి.

ఉదాహరణకి, మీ కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిందంటే, మరీ ముఖ్యంగా 50 ఏళ్లలోపే వచ్చిందంటే, మీకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కు...