భారతదేశం, మే 22 -- Professor Nageshwar Janasena Controversy : సోషల్ మీడియా వేదికగా జరిగే రాజకీయ విశ్లేషణలు, చర్చలు ఒక్కోసారి తీవ్ర దుమారం రేపుతుంటాయి. అలాంటి పరిణామమే ఏపీ రాజకీయవర్గాల్లో చోటు చేసుకుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ కేంద్రంగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌లను లక్ష్యంగా చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అయిన. ఓ వార్త ఈ వివాదానికి ప్రధాన కారణమైంది.

యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలపై సమకాలీన రాజకీయాలపై ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ విశ్లేషణలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జనసేన అగ్రనేతలకు సంబంధించిన ఒక అంశాన్ని తన విశ్లేషణలో ప్రస్తావించారు.వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్....