భారతదేశం, ఆగస్టు 9 -- తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులపై ప్రతి ఏటా మరీ మితిమీరి పడుతున్న ఫీజుల భారాన్ని అరికట్టేందుకు, పాఠశాలల యాజమాన్యాల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యాలు తమ తరగతుల వారీ ఫీజుల వివరాలను తగిన ఆధారాలతో సహా డిపార్ట్‌మెంట్ అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

పాఠశాల యాజమాన్యాలు తమ వద్ద అమల్లో ఉన్న ఫీజు వివరాలను విద్యాశాఖ అధికారిక పోర్టల్ అయిన https://schooledu.telangana.gov.in/ లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు నిర్బంధ రికార్డులను సమర్పించేలా చూడటంతో పాటు, ఏటేటా అడ్డగోలుగా పెంచుతున్న ఫీజుల దోపిడీకి చెక్ పెట్టడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం....