Hyderabad, ఆగస్టు 6 -- హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది. ఈ మధ్యే ఖౌఫ్ (Khauf) అనే సిరీస్ తో భయపెట్టిన ఆ ఓటీటీ.. అలాంటిదే మరో ఒరిజినల్ సిరీస్ తీసుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు అంధేరా (Andhera). బుధవారం (ఆగస్ట్ 6) ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.

ఈ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'అంధేరా'ను ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ తో కలిసి ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 14న స్ట్రీమింగ్ కానుంది. సూపర్‌నేచురల్ అంశాలతో కూడిన ఈ భయంకరమైన ఇన్వెస్టిగేటివ్ డ్రామాలో ఎనిమిది ఎపిసోడ్ లు ఉండనున్నాయి. ఇందులో ప్రియా బాపట్, కరణ్‌వీర్ మల్హోత్రా, ప్రాజక్తా కోలీ, సుర్వీన్ చావ్లాతో పాటు అనేక మంది నటీనటులు నటించారు.

ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన 'అంధేరా'లో వ...