భారతదేశం, జూలై 7 -- హైదరాబాద్‌లోని మియాపూర్‌లో అత్యంత కలకలం రేపిన ఓ హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో.. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా అంతమొందించింది. ఆపై ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడింది. గతేడాది నవంబర్‌లో జరిగిన ఈ క్రూరమైన ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా బయటకొచ్చాయి.

పోలీసుల కథనం ప్రకారం.. గతేడాది నవంబర్ నెలలో తన భర్త కనిపించడం లేదంటూ సదరు మహిళ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే నెలలు గడుస్తున్నా అతడి ఆచూకీ లభించకపోవడం, మహిళ ప్రవర్తనలో కొన్ని తేడాలు గమనించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

ఈ కేసులో ఎలాంటి క్లూ దొరకకపోవడంతో మియాపూర్ పోలీసులు సాంకేత...