భారతదేశం, జూన్ 24 -- తెలిసి తెలియని వయసులో వచ్చే ఆకర్శణతో అయిన వాళ్లనే చంపుకొంటున్నారు. ప్రేమ పేరుతో ఆవేశంలో కన్నవాళ్లనే కడతేరుస్తు్న్నారు. చిన్న వయసులో ప్రేమ పడటం తల్లిదండ్రులు అడ్డు చెబితే చావడమో.. చంపడమో చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ప్రేమ వ్యవహారంలో పదో తరగతి బాలికను తల్లి మందలించడంతో చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్దాం..

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్‌బీ నగర్‌లో అర్ధరాత్రి హత్య జరిగింది. అయితే పోలీసులు కేసు విచారణ చేస్తుండగా విస్తూపోయే విషయాలు తెలిశాయి. వివరాలు తెలిసి అందరూ షాక్ అయ్యారు. పదో తరగతి బాలికనే ఈ హత్యకు కారణమని తెలిసింది.

ఎన్ఎల్‌బీ నగర్‌లో సట్ల అంజలి(39) తన కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. బాలిక పదో తరగతి చదువుతోంది. శివ అనే 19 ఏళ్ల వ్యక్తితో బాలికకు పరిచయ...