Telangana,hyderabad, అక్టోబర్ 5 -- హైదరాబాద్ లో నడిచే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ధరల పెంపుపై కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచటం దుర్మార్గమన్నారు. జంట నగరాల్లోని పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

"పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న తరుణంలో.. ప్రతి ప్రయాణికుడిపై నెలకు 500 రూపాయల అదనపు భారం మోపితే బడుగుజీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి. ఇప్పటికే విద్యార్థుల బస్ చార్జీలు, టీ-24 టిక్కెట్ చార్జీలను పెంచింది చాలదన్నట్టు.. ఇప్పుడు కనీస చార్జీపై కనికరం లేకుండా 50 శాతం టిక్కెట్టు ధరలను పెంచడం రేవంత్ అసమర్థ విధానాలకు నిదర్శనం" అని కేటీఆర్ విమర్శించారు.

"రాజధాని వాసుల నడ్డివిరిచి ప్రతినిత్యం దాదాపు కోటి ...