Telangana,hyderabad, అక్టోబర్ 5 -- తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జంటనగరాల పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఈ -ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ పెంపు ఉండనుంది.

మొదటి 3 స్టేజీల వరకు రూ.5 చొప్పున పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇక 4వ స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. ఇక మెట్రో డీలక్స్‌, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5గా ఉంటుంది. ఇక రెండో స్టేజీ తర్వాత అదనంగా రూ.10 ఛార్జీ వసూలు చేయనున్నారు. టికెట్ ధరల పెంపుపై ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం అక్టోబర్ 6వ తేదీ అమల్లోకి రానుంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 డిపోలు ఉన్నాయి. 6 డిపోలలో 265 ఎలక్ట్రిక్ బస్సు కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం చివర్లో మరో 275 బస్సులను ప్రవేశపెట్టన...