భారతదేశం, మే 23 -- SCR Tirupati Charlapalli Weekly Express : తిరుపతి, హైదరాబాద్‌లోని చర్లపల్లి మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన తిరుపతి - చర్లపల్లి - తిరుపతి వీక్లీ స్పెషల్ రైలును రెగ్యూలరైజ్ చేసింది. మే 28, 2026 నుంచి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ గా సర్వీసులను ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.

ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల,ప్రొద్దుటూరు, నంద్యాల, దిగువమెట్ట, గిద్దలూరు, మార్కాపూర్ రోడ్, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లు ఉన్నాయి.

ఈ ఎక్స్‌ప్రెస్ రైలులో అన్ని వర్గాల ప్రయాణికులకు అనుగుణంగా కోచ్‌లను ఏర్పాటు చేశారు.

వేసవ...