భారతదేశం, మార్చి 14 -- న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు చేదువార్త. మీరు విమాన ప్రయాణానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ బడ్జెట్‌ను మరికొంత పెంచుకోవాల్సిందే. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు భారత విమానయాన రంగంపై పడింది. దేశంలోని ప్రధాన విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్ తమ టికెట్లపై అదనపు ఇంధన సర్ఛార్జీని (Fuel Surcharge) వసూలు చేయాలని నిర్ణయించాయి.

ఎయిర్ ఇండియా, ఇండిగో బాటలోనే ఇప్పుడు ఆకాశ ఎయిర్ కూడా నడవనుంది. మార్చి 15వ తేదీ (ఆదివారం) అర్ధరాత్రి 12:01 గంటల నుంచి బుక్ చేసుకునే టికెట్లపై ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఆ సంస్థ శనివారం ప్రకటించింది. ప్రయాణించే దూరం, సమయాన్ని బట్టి ఈ అదనపు భారం రూ. 199 నుండి రూ. 1,300 వరకు ఉంటుందని స్పష్టం చేసింది.

"కస్టమర్లకు సరసమైన ధరలకే సేవలు అందించాలని మేము కోరుక...