భారతదేశం, సెప్టెంబర్ 20 -- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జల్నా - తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. రానుపోను మొత్తం 12 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈనెల 21 నుంచి 27 తేదీల మధ్య రాకపోకలు సాగిస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఏపీలోని పలు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి.

జల్నా - తిరుచానురూ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఇవి 21 నుంచి ఈనెల 26వ తేదీ వరకు ప్రయాణిస్తాయి. ఆదివారం తేదీలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక తిరుచానూరు నుంచి జల్నాకు కూడా ఆరు సర్వీసులు నడుస్తాయి. ఈ సర్వీసులు ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు ఉంటాయి. కేవలం సోమవారం తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణలోని జహీరాబాద్, మర్పల్లి, వికారాబాద్, తాండూరు స్టేషన్లల్లో ఆగుతాయి. ఇక ఏపీలోని మంత్రాలయం, ఆదోనీ,...