Telangana,hyderabad, సెప్టెంబర్ 18 -- బ‌తుక‌మ్మ‌, దసరా పండుగల నేప‌థ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ పండుగ‌ల‌కు రాష్ట్రవ్యాప్తంగా 7,754 స్పెష‌ల్ బ‌స్సుల‌ను బస్సులను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో 377 స్పెష‌ల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని క‌ల్పించింది.

ఈ నెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు ప్ర‌త్యేక బ‌స్సులను న‌డ‌ప‌నుంది. సద్దుల బ‌తుకమ్మ ఈ నెల 30న‌, దసరా అక్టోబ‌ర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్ల‌కు ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముండ‌టంతో ఆ మేర‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచ‌నుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది.

హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్లై...