Telangana,hyderabad, ఆగస్టు 17 -- గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టీ 24 టిక్కెట్ల ధరలను తగ్గించింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ ఆఫర్ ను ప్రకటించినట్లు తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో రోజంతా ప్రయాణించడానికి వీలు కల్పించే టీ 24 టిక్కెట్ ధరను తగిస్తున్నామని... ఆగస్ట్ 31వ తేదీ వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ తో పాటు మెట్రో డీలక్స్‌ బస్సుల్లో 24 గంటల పాటు ఈ టికెట్లను కొనుగోలు చేసే సౌకర్యం కల్పించారు. పెద్దలకు ఇంతకు ముందు ఉన్న టికెట్ ధర రూ.150 ఉండగా... రూ.130 చేశారు. ఇక మహిళలు, సీనియర్ సిటిజన్స్‌కు ప్రస్తుతం రూ.120 ఉండగా... రూ.110 చేశారు. పిల్లలకు ఇంతకు ముందు ఉన్న టికెట్ ధర రూ.100ను సవరించి రూ.90 చేశారు. ఈ ధరలు కేవలం ఆగస్ట్ 31వ తేదీ వరకు మాత్రమే అమల్ల...