భారతదేశం, సెప్టెంబర్ 7 -- Hyderabad Pune Shatabdi Express : హైదరాబాద్ నుంచి పూణె వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ అందించింది. ఇవాళ (సెప్టెంబర్ 7, 2026) మధ్యాహ్నం సికింద్రాబాద్/హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన హైదరాబాద్ - పూణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 12026) ప్రయాణ సమయంలో మార్పులు చేసినట్లు పేర్కొంది.

నిర్ణీత వేళల ప్రకారం.. ఈ రైలు ఈరోజు(సెప్టెంబర్ 7, 2026) మధ్యాహ్నం 14:40 గంటలకు (మధ్యాహ్నం 2:40 గంటలకు) హైదరాబాద్ నుంచి పూణెకు బయలుదేరాల్సి ఉంది. కానీ పలు కారణాల రీత్యా ఈ రైలును రీషెడ్యూల్ చేశారు.

తాజా ప్రకటనలోని వివరాల ప్రకారం... ఈ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ఈరోజు రాత్రి 23:00 గంటలకు (రాత్రి 11:00 గంటలకు) హైదరాబాద్ నుంచి పూణెకు ప్రయాణమవుతుంది. ప్రయాణికులు ఈ టైమింగ్ మార్పును గమనించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. అందుక...