భారతదేశం, అక్టోబర్ 8 -- పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌కు వన్‌వే పండుగ ప్రత్యేక రైళ్లను నడపనుంది. దసరా, దీపావళి వేళ సొంతూర్లు, సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

హైదరాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ వన్‌వే స్పెషల్ (రైలు నంబరు: 07031) : ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 9 శుక్రవారం నాడు రాత్రి 23:25 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. రెండు రోజుల ప్రయాణం తర్వాత (రెండో రోజు) ఉదయం 11:55 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. ఈ రైలును ఒక్క ట్రిప్ (01 సర్వీస్) మాత్రమే నడపనున్నారు.

చర్లపల్లి - హజ్రత్ నిజాముద్దీన్ వన్‌వే స్పెషల్ (రైలు నంబర్ - 07035) :...