భారతదేశం, జూన్ 7 -- భాగ్యనగరంలో ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (నుమాయిష్ మైదానం) వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లు ప్రకటించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం (జూన్ 8) ఉదయం 6 గంటల నుంచి మంగళవారం (జూన్ 9) రాత్రి 8 గంటల వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపులు నిరంతరాయంగా అమలులో ఉంటాయి. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులు, సాధారణ వాహనదారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా...