భారతదేశం, నవంబర్ 18 -- SCR Festival Special Trains 2026 : పండగ సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. పోదనూర్ - బరౌని, ఎస్ఎంవీటీ బెంగళూరు - దానాపూర్, న్యూఢిల్లీ - బెంగళూరు కంటోన్మెంట్ మార్గాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు ప్రయాణించనుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఊరట లభించనుంది.

రైలు నంబర్ 04005 (బెంగళూరు కంటోన్మెంట్ - న్యూఢిల్లీ స్పెషల్): తిరుగు ప్రయాణంలో ఈ రైలు నవంబర్ 24, 2026 (మంగళవారం) మధ్యాహ్నం 15:45 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌లో బయలుదేరుతుంది. గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఈ...