ప్రయాణికులకు అలర్ట్ - చర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్త పార్కింగ్ రూల్స్, ఇవిగో వివరాలు
భారతదేశం, జూలై 13 -- హైదరాబాద్ నగరంలోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, స్టేషన్ ఆవరణలో వాహనాల రాకపోకలను సులభతరం చేయడానికి చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సరికొత్త యాక్సెస్, పార్కింగ్ నిబంధనలను ప్రవేశపెట్టారు. స్టేషన్ పరిధిలోని సౌత్ టెర్మినల్, అంటే ప్లాట్‌ఫారమ్ నంబర్ 9 వైపు ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వచ్చాయని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులను దింపడానికి లేదా పికప్ చేసుకోవడానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా ఉచిత సమయాన్ని కేటాయించడంతో పాటు నిర్దేశిత రుసుములను ఖరారు చేశారు.
రైల్వే స్టేషన్‌కు వచ్చే సాధారణ వాహనదారులకు ఊరటనిస్తూ 20 నిమిషాల పాటు ఉచిత పికప్ మరియు డ్రాప్ సదుపాయాన్ని కల్పించారు. నిర్ణీత 20 నిమిషాల సమయం దాటితే మాత్రం ఓవర్‌స్టే ఫీజు వర్తిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.