భారతదేశం, అక్టోబర్ 17 -- మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అక్టోబర్ 20న జరగనున్న ధమ్మచక్ర ప్రవర్తన దినోత్సవ వేడుకలకు హాజరయ్యే భక్తులు, ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. బీదర్ నుంచి అజ్నీ (నాగ్‌పూర్ సమీపం) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 19 మరియు 20 తేదీల్లో రాకపోకలు సాగిస్తాయి.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపుల ప్రయాణంలో పలు కీలక స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ తెలిపారు. జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట్, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా స్టేషన్లలో ఈ రైళ్లకు నిలిపే సదుపాయం కల్పించారు.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల కోసం స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లా...