భారతదేశం, జనవరి 6 -- రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హారర్ కామెడీ మూవీ 'ది రాజా సాబ్' (The Raja Saab) సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమైంది. జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేషన్ పూర్తయ్యింది. కొన్ని కీలకమైన కట్స్, మార్పుల తర్వాత సినిమాకు యూఏ 16+ సర్టిఫికెట్ జారీ చేశారు.

మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజా సాబ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ కామెడీ టైమింగ్, హారర్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సినిమా రన్ టైమ్ విషయంలో మారుతి ఏమాత్రం కాంప్రమైజ్ అయినట్లు కనిపించడం లేదు.

ది రాజా సాబ్ సినిమా మొత్తం నిడివి 189 నిమిషాలు.. అంటే 3 గంటల 9 నిమిషాలు కావడం గమనార్హం. హారర్ కామెడీకి ఇది చాలా పెద్ద రన్‌టైమ్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో నుంచి రెండు కీలకమైన కట్స్ సూచించారు.

ఇందు...