Telangana,hyderabad, సెప్టెంబర్ 17 -- నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రజాపాలన సాధించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కష్టమో, నష్టమో ప్రజలతో పంచుకుంటున్నామన్నారు.ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని వ్యాఖ్యానించారు.ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని చెప్పుకొచ్చారు.

ఇవాళ హైదరాబాద్ లోని పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు.

"బానిసత్వ సంకెళ్లను తెంచడానికి అమరులైన వారికి నివాళులర్పిస్తున్నాను. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రజాపాలన సాధించుకున్నాం.. కష్టమో, నష్టమో ప్రజలతో పంచుకుంటున్నాం. సాయుధ పోరాటస్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కనపెట్టాం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చె...