భారతదేశం, జూలై 16 -- ప్రపంచంలో అత్యంత వృద్ధ మారథాన్ అథ్లెట్ ఫౌజా సింగ్(114)ను కారుతో ఢీకొట్టిన వ్యక్తిని పంజాబ్‌లోని జలంధర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కర్తార్ పూర్‌లోని దాసుపూర్ గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ అమృత్ పాల్ సింగ్ ధిల్లాన్ (30)గా గుర్తించారు. ఈ రోజు పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. అతని ఫార్చ్యూనర్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.

విచారణలో అమృత్ పాల్ తన నేరాన్ని అంగీకరించాడు. ఫౌజా సింగ్ నడుచుకుంటూ వెళ్తుండగా, అతను గ్రామం నుంచి జాతీయ రహదారి వైపు ఒంటరిగా వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇంతలో వేగంగా వచ్చిన ఫార్చ్యూనర్ కారు ఢీకొట్టి పరారైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఫౌజా సింగ్‌ను జలంధర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ ఘటనపై ఆదంపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమో...