Hyderabad, ఆగస్టు 5 -- అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన సైన్స్ ఫిక్షన్ సినిమా రీబూట్ 'వార్ ఆఫ్ ది వరల్డ్స్' రోటెన్ టొమాటోస్‌లో 0% రేటింగ్‌తో విమర్శల పాలైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత చెత్త మూవీ.. అసలు ఎందుకు తీశారో అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి, రోటెన్ టొమాటోస్ వెబ్‌సైట్‌లో 12 వ్యూస్ ఆధారంగా ఈ సినిమాకు 0% రేటింగ్ ఉంది. అలాగే, ఐఎండీబీలో 10కి 3.2 రేటింగ్ మాత్రమే లభించింది. ఇవి రెండూ ఆడియెన్స్ ఇచ్చే రేటింగ్స్ ను క్రోడీకరించి ఫైనల్ రేటింగ్ ఇస్తాయి.

వార్ ఆఫ్ ది వరల్డ్స్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఈ సినిమాలో NWA ఫేమ్ ఐస్ క్యూబ్, 'డెస్పరేట్ హౌస్‌వైవ్స్' స్టార్ ఎవా లాంగోరియా నటించారు. సినిమా కథాంశం ప్రకారం.. "టెక్నాలజీ, నిఘా, ప్రైవసీ వంటి ఈ తరానికి చెందిన అంశాలతో నిండిన ఒక థ్రిల్లింగ్ స్టోరీ". హెచ్‌జి వెల్...