భారతదేశం, ఆగస్టు 25 -- ఆగస్టు 25న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివాదంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కేంద్ర సమాచార కమిషన్ (CIC) ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. ఇప్పుడు ప్రధాని మోదీ డిగ్రీని బహిర్గతం చేయరు. ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలని ఢిల్లీ యూనివర్సిటీకి కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) గతంలో జారీ చేసిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు తాజాగా పక్కనపెట్టింది. ఈ మేరకు ఫిబ్రవరి 27న రిజర్వ్ చేసిన తీర్పును జస్టిస్ సచిన్ దత్తా వెలువరించారు.

నీరజ్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా ప్రధాని మోదీ డిగ్రీ వివరాల కోసం ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్నాడు. దీనిలో 1978 సంవత్సరంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బీఏ ఉత్తీర్ణులైన విద్యార్థులందరి గురించి సమాచారం కోరారు. అదే సంవత్సరం ప్రధాని మోడీ గ్రాడ్యుయేషన్ పరీక్షలో కూడా ఉత్త...