ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ - కరువు సాయంతో పాటు పలు అంశాలపై చర్చ
భారతదేశం, నవంబర్ 15 -- ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ప్రధానిని కలిసిన ముఖ్యమంత్రి.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, అభివృద్ధి అవసరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన నిధులు, సహాయక చర్యలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
ప్రధానంగా, ఎల్నినో ప్రభావం వల్ల తెలంగాణలో ఏర్పడిన తీవ్ర కరవు పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వివరించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. కరవు సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు అవసరమైన ప్రత్యేక ప్యాకేజీ నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రధానిని కోరారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.