భారతదేశం, ఆగస్టు 25 -- ప్రధాని, సీఎం, మంత్రులను తొలగింపు బిల్లును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ సంస్థలను పని చేస్తాయన్నారు. ఇంతకీ ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుందన్నారు. అంతేకాదు మంత్రిమండలి సలహా మేరకు పనిచేసే రాష్ట్రపతి ప్రధానిని ఎలా తొలగిస్తారని ఒవైసీ ప్రశ్నించారు. ప్రధానిని తొలగించడానికి ప్రతిపాదిత చట్టం రాష్ట్రపతికి అధికారం ఇస్తుందా అని అడిగారు. రాష్ట్రపతి ప్రధానిని రాజీనామా చేయిస్తారా? అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 130వ రాజ్యాంగ సవరణలో పలు లోపాలు ఉన్నాయని హైదరాబాద్ ఎంపీ ఎత్తిచూపారు. దర్యాప్తు సంస్థలను స్వతంత్రంగా నియమించకపోతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని అసదుద్దీన్ అన్నారు. ఎస్ఐ నుంచి డీజీప...