భారతదేశం, ఆగస్టు 18 -- అంతరిక్ష చరిత్రాత్మక యాత్రను ముగించుకుని తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కలిశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని(ఐఎస్ఎస్) సందర్శించిన భారతీయుడిగా వ్యోమగామి శుభాన్షు ఇటీవలే రికార్డు సృష్టించారు. జూన్ 25 నుంచి జూలై 15 వరకు ఐఎస్ఎస్ ఆక్సియోమ్-4 మిషన్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రధాని నివాసంలో మోదీని శుభాన్షు కలిశారు. వ్యోమగామి జాకెట్‌ ధరించి వచ్చిన శుభాన్షు శుక్లాకు ప్రధాని మోదీ ఆలింగనంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా శుభాన్షు యాక్సియోమ్-4 మిషన్ ప్యాచ్‌ను ప్రధాని మోదీకి బహుమతిగా ఇచ్చారు. ప్రధాని మోదీకి అంతరిక్ష కేంద్రం నుంచి భూమి చిత్రాలను స్పెషల్ గిఫ్ట్‌గా అందించారు. శుక్లా ఆక్సియం-4 మిషన్ ప్యాచ్‌ను, అంతరిక్షంలోకి తీసుకెళ్లిన జాతీయ జెండాను ప్రధాని మోదీకి అందజేశారు. ఆ తర్వాత శుభా...