భారతదేశం, జనవరి 16 -- 2027 నాటికి రెవెన్యూ సమస్య లేకుండా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం నారావారిపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆయన. ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్తామని ప్రకటించారు. జాయింట్ కలెక్టర్లు ఈ రెవెన్యూ సమస్యలపైనే ఈ ఏడాది మొత్తం పని చేస్తారని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వంలో ఇష్టం లేని వారి భూములు 22ఏలో పెట్టారని. గందరగోళం సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.కానీ తాము ఏడాది టార్గెట్ పెట్టుకుని సర్వే పూర్తి చేసి రూపాయి కూడా లేకుండా క్యూఆర్ కోడ్ తో పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. 2027 నాటికి రెవెన్యూ సమస్య లేకుండా పరిష్కరిస్తామని ఉద్ఘాటించారు.

పర్యాటకంలో భాగంగా తిరుపతి, రూరల్ ప్రాంతంలో హోం స్టేలకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం నారావారిపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆ...