భారతదేశం, ఆగస్టు 26 -- అమరావతి: ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఆరోగ్య సంరక్షణ సదుపాయాల మెరుగుదలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పట్టణాలలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలల పనుల పురోగతిపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలంటే మౌలిక వసతులు పెంచడం తప్పనిసరి అని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 1,000 మంది జనాభాకు 2.24 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు ప్రకారం ఇది 3 పడకలు ఉండాలని అధికారులు వివరించ...