భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆరోగ్యం అనేది కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం కాకూడదని, ప్రతి సామాన్యుడికి అత్యుత్తమ వైద్యం అందాలనే లక్ష్యంతో పంజాబ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ముఖ్యమంత్రి సేహత్ యోజన' (Mukhya Mantri Sehat Yojna) ఊహించని రీతిలో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. కేవలం మూడు నెలల స్వల్ప కాలంలోనే 40 లక్షలకు పైగా కుటుంబాలు ఈ పథకం కింద నమోదై కార్డులు పొందడం విశేషం. ఏప్రిల్ 21వ తేదీన ఒక్కరోజే రికార్డు స్థాయిలో 28,766 మంది నమోదు చేసుకున్నారంటే ఈ పథకంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు.

గతంలో భారీ ఖర్చుతో కూడుకున్న వైద్యం కోసం ప్రజలు అప్పులపాలవ్వడమో, లేదా చికిత్సను మధ్యలోనే నిలిపివేయడమో జరిగేది. కానీ ఈ పథకం ద్వారా ఏటా రూ. 10 లక్షల వరకు నగదు రహిత (Cashless) వైద్య సదుపాయం లభిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలోని పట్...