భారతదేశం, నవంబర్ 18 -- హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ అధికారుల అవినీతి వల్ల అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కింది స్థాయి వ్యవస్థలో పాతుకుపోయిన అధికారుల అవినీతిని జర్నలిస్టులే బయటపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ సమీపంలోని జడ్చర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిరుధ్ రెడ్డి, జర్నలిస్టుల కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపుతున్నాయని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న తరుణంలో, సొంత పార్టీ ఎమ్మెల్యేనే అధికారుల పనితీరుపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్...