భారతదేశం, జూలై 28 -- ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీట‌ర్లు బిగించ‌వ‌ద్దని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ‌ప‌ట్నంలో విద్యుత్ శాఖ‌ అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించిన మంత్రి.. ఈపీడీసీఎల్ ప‌రిధిలో విద్యుత్ శాఖ ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాల‌కు సంబంధించి అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ స్మార్ట్ మీట‌ర్లను ముందుగా విద్యుత్ శాఖ అధికారులు, రాజ‌కీయ నాయ‌కుల ఇళ్లకు బిగించి వాళ్లను రోల్ మోడ‌ల్ గా చూపించిన త‌రువాత ప్రజలను స్మార్ట్ మీట‌ర్ల వినియోగానికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు ఆమోదం లేని ఏ విష‌యం మీద అయినా కూట‌మి ప్రభుత్వం ముందుకు వెళ్లదని ఈ సంద‌ర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

స్మార్ట్ మీట‌ర్ల వినియోగానికి సంబంధించి కొంద‌రు సోష‌ల్ మీడియాలో లేనిపోని అపోహ‌లు ...