Andhrapradesh, ఆగస్టు 13 -- ప్రకాశం బ్యారేజీ లో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ప్లో, ఔట్‌ఫ్లో 3,97,250 క్యూసెక్కులుగా ఉంది. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలకు అలర్ట్‌ జారీ అయింది.

కృష్ణా నది పరివాహక ప్రాంత మండల అధికారులు ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండి కాలువల పటిష్టతకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదేశాలిచ్చారు. తహసిల్దారులు, ఎంపీడీవోలు, గ్రామ రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా జల వనరుల శాఖ ఇంజనీర్లు,సిబ్బంది కృష్ణ నది పరివాహక ప్రాంతాల్లో...