Andhrapradesh,prakasham, ఆగస్టు 17 -- ప్రకాశం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రూ.5 లక్షల అప్పు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కుమార్తెను కిడ్నాప్ చేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో శనివారం చోటుచేసుకుంది. విచారణ అనంతరం తిరుపతికి చెందిన ఆర్.ఈశ్వర్ రెడ్డిని నిందితుడిగా గుర్తించారు.

ప్రాథమిక వివరాల ప్రకారం. శ్రీనివాసరావు అనే వ్యక్తి తిరుపతిలో కూలీగా పనిచేస్తున్నాడు. ఇతను ఈశ్వర్ రెడ్డి వద్ద రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో కుమార్తెను టార్గెట్ చేయాలని ఈశ్వర్ రెడ్డి నిర్ణయించుకున్నాడు.

శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం ఈశ్వర్ రెడ్డి బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లాడు. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి శ్రీనివాస్ రావు పంపించాడని నమ్మించారు. తనతో రావాలని ఒప్పించాడు. అనంతరం ఆ...