Andhrapradesh,prakasham, ఆగస్టు 9 -- ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాకిచెర్ల వద్ద శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో పల్నాడుకు చెందిన ముగ్గురు మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 మంది కుటుంబ సభ్యులు పెళ్లి వేడుక కోసం కారులో తిరుపతి వెళ్తున్నారు. డ్రైవర్ కుడివైపు నుంచి ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా. మిగతా వాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ఈ కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తూర్పు గోదావరి ...