భారతదేశం, ఆగస్టు 15 -- తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. యూనిఫాం సర్వీసెస్(పోలీస్) ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని మరో 2 ఏళ్ల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నూతన మినహాయింపు పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఎక్సైజ్, రవాణా (ట్రాన్స్‌పోర్ట్), అటవీ (ఫారెస్ట్) శాఖలలో జరిగే ప్రత్యక్ష నియామకాలకు వర్తిస్తుంది. ఇప్పటిదాకా ఉన్న 5 ఏళ్లు.. ఇప్పుడు ఇచ్చిన 2 ఏళ్లతో మెుత్తం సడలింపు 7 ఏళ్లకు చేరింది. ఇటీవల అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది మే 18న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే సాధారణ నియామక నిబంధనల ప్రకారం ఇచ్చే వయోపరిమితిపై 5 ఏళ్ల సడలింప...