భారతదేశం, జూన్ 24 -- సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత పలు అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. పోలవరం బనకచర్ల అనుసుంధాన ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకో ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. పక్క రాష్ట్రానికి ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని చెప్పారు.

తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారని, అయినా అభ్యంతరం చెప్పలేదన్నారు చంద్రబాబు. నేతలు అందరూ ఈ ప్రాజెక్టుపై మాట్లాడాలని చెప్పారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అసరం మంత్రులు, నేతలపై ఉందని అన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....