భారతదేశం, జూలై 15 -- ఆంధ్రప్రదేశ్‌లో పోలవరానికి పర్యాటక శోభను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. పోలవరం డ్యామ్‌తోపాటు గోదావరి నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు ప్రాంతంతోపాటు ప్రాజెక్టు దిగువన, ఎగువన టూరిజం డెవల్మెంట్‌కు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ అంశంపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్, టూరిజం శాఖ అధికారలుతో పాటు ఏజెన్సీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు.

నదీతీరం వెంట టూరిజం ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు వద్ద కేబుల్ బ్రిడ్జ్ డిజైన్, స్పిల్ వే బ్యూటిఫికేషన్ సహా మాస్టర్ ప్లాన్‌పై చర్చించారు. టూరిజం ప్రాజెక్టుల అభివృద్దిలో అనుభవం ఉన్న నిప్పాన్ కోయి సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ప్...