భారతదేశం, జూన్ 24 -- పెట్టుబడుల ప్రపంచంలో మార్పు అనేది ఎప్పుడూ కాస్త అసౌకర్యంగానే ఉంటుంది. కానీ, ఆ మార్పును గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. గత కొన్నేళ్లుగా ఇన్వెస్టర్లు మార్కెట్లలో ఎన్నో నాటకీయ పరిణామాలను చూశారు. ఈక్విటీల్లో ఆకస్మిక పతనాలు, కమోడిటీల ధరల అకస్మిక పరుగు, వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు, అంతర్జాతీయ పరిణామాల వల్ల వచ్చే అస్థిరత వంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెంటవెంటనే సంభవించాయి. ఇలాంటి అస్థిర వాతావరణంలో సాంప్రదాయ, స్థిరమైన పోర్ట్‌ఫోలియోలు తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత తరుణంలో మార్కెట్ ఎలా ఉంటుందో ముందే ఊహించడం కంటే, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండటమే అత్యంత కీలకం.

"అల్లకల్లోల సమయాల్లో ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదం ఆ అల్లకల్లోలం కాదు.. నిన్నటి లాజిక్‌తో వ్యవహరించడ...