భారతదేశం, నవంబర్ 26 -- పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ విషయంలో పొరపాటు జరిగిందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్ ఎస్ఈ మల్లికార్జున్ నిర్లక్ష్యం వల్లే పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మాణం జరిగిందని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖలో ఆంధ్రా అధికారులను పెట్టుకోవడం వల్లే ఏపీ అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తోందన్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీ నేతలు అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు.

ఏడాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించుకుపోయేందుకు అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తోందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆ విషయం తెలిసినా నాగార్జున సాగర్ ఎస్ఈ మల్లికార్జున్ ఆంధ్రా ప్రాంత వ్యక్తి కాబట్టే తమకు చెప్పలేదని ఆరోపించారు. ఆంధ్రా వ్యక్తిని సాగర్ ఎస్ఈగా కొనసాగించడం తమ పొరపాటేనని అన్నారు. ఈ వ్యవహారంపై ఎ...