భారతదేశం, జూలై 28 -- ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దానికి కొత్తగా ప్రవేశపెట్టిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026' నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. లోక్‌సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ, ఉప నేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్ట సవరణలు కేవలం ఒక కంటితుడుపు చర్య మాత్రమేనని అభివర్ణించారు.

2024లోనే పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు, 2026లో మళ్లీ నీట్ (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీలు ఎలా సంభవించాయని గొగోయ్ ప్రశ్నించారు.

44 మందికి బెయిల్: 2024 చట్టం కింద దాఖలైన ఛార్జ్‌షీట్‌లో 45 మంది నిందితులు ఉంటే, వారిలో 44 మంది బెయిల్‌పై బయటకు వచ్చారని ఒక పత్రికా కథనాన్ని ఉటంకిస్తూ ఆయన పేర్కొన్...