భారతదేశం, మార్చి 10 -- హైదరాబాద్ నగరంలో రోడ్లను విస్తరించుకోవటంతో పాటు చెరువులను పునరుద్ధరించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నాలాల ఆక్రమణలను తొలగించుకుందామని సూచించారు. పిల్లలకు క్రీడా మైదానాలు కట్టుకోవాలని. అభివృద్ధి చెందుతున్న ఒక మంచి నగరంగా అభివృద్ధి చేసుకుందామన్నారు.

కూకట్‌పల్లిలో హైడ్రా పునరుద్ధరించిన నల్లచెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. చెరువులో గంగమ్మతల్లికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

కొందరికి కష్టమొచ్చినా. బాధపడినా చెరువుల పునరుద్ధరణ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్నవారు సహకరిస్తే.. వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు. చెరువులు, కాల్వలు ఆ...